: తల్లిదండ్రులూ.. ‘విశాఖ’కు మీ పిల్లలను పంపకండి: సీపీ యోగానంద్
విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్ లో తలపెట్టిన ప్రత్యేక హోదా సాధన సదస్సుకు ఎలాంటి అనుమతులూ లేవని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడికి పంపవద్దని పోలీస్ కమిషనర్ యోగానంద్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ నెల 27, 28న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు జరగనున్న నేపథ్యంలో బీచ్ రోడ్డులో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామన్నారు. కాగా, ఈ సదస్సుకు రెండు వేల మంది విదేశీ ప్రతినిధులు, పన్నెండు మంది వాణిజ్య శాఖ మంత్రులు హాజరుకానున్నారు.