: యూపీ ఓట్ల కోసమే... మరోసారి 'రామమందిరం' ప్రస్తావన తెచ్చిన బీజేపీ!


వచ్చే నెల 11 నుంచి ఏడు విడతలుగా జరగనున్న యూపీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ, వివాదాస్పద అయోధ్య రామమందిరాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. తాము అధికారంలోకి వస్తే, అద్భుతరీతిలో రామాలయాన్ని నిర్మిస్తామని యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, అయోధ్యలో రామాలయం ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశమని, రెండు నెలల్లో గుడిని కట్టలేమని, ఎన్నికల తరువాత పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తే బీజేపీ ఆలయాన్ని కట్టి చూపిస్తుందని అన్నారు.

యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ అటు దళితులను, ఇటు బలహీన వర్గాలను మోసం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీని అధికారంలోకి తేవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకు అయోధ్య రామాలయం అంశాన్ని బీజేపీ వాడుకోవాలని చూస్తోందని సమాజ్ వాదీ పార్టీ విమర్శించింది. ఓట్ల సమయానికి మాత్రమే వారికి ఆలయం గుర్తుకు వస్తుందని ఆ పార్టీ ప్రతినిధి ఒకరు ఆరోపించారు. బీజేపీ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.

  • Loading...

More Telugu News