: సోనియాగాంధీ స్థానంలో ప్రియాంకగాంధీ?


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. పార్టీ వ్యవహారాల్లో సైతం ఆమె ఇంతకు ముందులా చురుగ్గా ఉండటం లేదు. అన్ని విషయాలను ఆమె కుమారుడు రాహుల్ గాంధీనే చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆమె తప్పుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎంపీగా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలి నియోజకవర్గం నుంచి 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆమె కుమార్తె ప్రియాంకగాంధీ పోటీ చేస్తారని ఓ జాతీయ దినపత్రికలో కథనం వచ్చింది. అనారోగ్య కారణాల వల్ల బాధ్యతల నుంచి సోనియాగాంధీ తప్పుకోవాలని భావిస్తున్నట్టు సదరు పత్రిక తన కథనంలో వెల్లడించింది.

మరోవైపు, ప్రియాంకపై రాహుల్ ఆధారపడటం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇప్పటికే సోనియా చూసుకుంటున్న పనులను ప్రియాంక చాలామటుకు చూసుకుంటున్నారు. రాహుల్ కార్యాలయం తెరవెనుక కార్యకలాపాలను కూడా ప్రియాంక చూసుకుంటున్నారట. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కుదుర్చుకోవడంలో కూడా ప్రియాంకనే కీలకపాత్ర పోషించారు. రాజకీయాల్లో ప్రియాంక మరింత మెరుగైన పాత్ర పోషించాలనుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ నిన్న బహిరంగంగా ప్రకటించింది. ఎస్పీతో పొత్తు వ్యవహారంలో క్రెడిట్ ఆమెదేనని తెలిపింది. యూపీ ఎన్నికల్లో కూడా రాహుల్ తో కలసి, ప్రియాంక ప్రచారం చేస్తారని పరిశీలకులు అంటున్నారు. అఖిలేష్ భార్య డింపుల్ తో కలసి కూడా ఆమె ప్రచారం చేసే అవకాశం ఉంది. 

  • Loading...

More Telugu News