: ఇకపై ఏపీలో ప్రవేశ పరీక్షలన్నీ ఆన్ లైన్ లోనే: మంత్రి గంటా


ఏపీలో ప్రవేశ పరీక్షలు అన్నీ ఇక ఆన్ లైన్ లోనే నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించిన అన్ని ప్రవేశ పరీక్షలు ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామని, ఈ విధంగా నిర్వహిస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, టీసీఎస్ భాగస్వామ్యంతో ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు మొబైల్ యాప్ ను తయారు చేస్తున్నామని, దీని ద్వారా ఆయా ప్రవేశ పరీక్షల తేదీలు, కేంద్రాలు, తదితర వివరాలను తెలుసుకోవచ్చని చెప్పారు. 

  • Loading...

More Telugu News