: మమతా బెనర్జీ విషయంలో నా అంచనా తప్పయింది.. ఆమె చాలా కఠినాత్మురాలు: బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విషయంలో తన అంచనా తప్పయిందని బంగ్లాదేశ్ ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్ అన్నారు. ఆమె అధికారంలోకి వస్తే అంతా బాగుంటుందని తాను భావించానని, అయితే ఆమెలో తాను ఊహించుకున్నంత మంచితనం లేదని వ్యాఖ్యానించారు. వామపక్ష ప్రభుత్వం కంటే ఆమె కఠినాత్మురాలని తేలిపోయిందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు తాను బలయ్యానని పేర్కొన్న తస్లిమా తన విషయంలో రాజకీయ నాయకులందరూ ఒకేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్లో ప్రభుత్వం మారితే అంతా సర్దుకుంటుందని, తాను అక్కడికి వెళ్లొచ్చని భావించానని, కానీ అధికారంలో ఎవరున్నా పరిస్థితులు మారవని తనకు ఇప్పుడు అర్థమైందని తస్లిమా విమర్శించారు.