: అమెరికాలో రోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం కురిపిస్తూ వెళ్లిపోయిన వ్యాన్!
కరెన్సీ నోట్లను నింపుకొని వెళుతున్న ఓ వ్యాను వెనుక డోర్ తెరుచుకోవడంతో రోడ్డుపై కరెన్సీ నోట్లు పడిపోయిన ఘటన అమెరికాలోని రాలేలో జరిగింది. నగదు నిర్వహణ సంస్థ లూమీస్ ఆర్మర్డ్ కార్ వెనుక డోర్ నుంచి పడుతోన్న నోట్లను చూసిన స్థానికులు ఆ కరెన్సీని తీసుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో 20 డాలర్ల నోట్లతో కూడిన కట్టలు గాల్లోకి ఎగిరిపడ్డాయని అక్కడి పోలీసులు తెలిపారు. కొందరు స్థానికులు తమకు దొరికిన 20 డాలర్ల నోట్లను తిరిగి ఇచ్చేశారని, నగదును తీసుకుని వెళ్లిన వారిని త్వరలోనే గుర్తిస్తామని అన్నారు.