pawan kalyan: వచ్చేనెల మంగళగిరిలో పర్యటించనున్న పవన్ కల్యాణ్
జనసేనాని, సినీనటుడు పవన్ కల్యాణ్ వచ్చేనెల 20న మంగళగిరిలో పర్యటించనున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ చేనేత రంగానికి తాను ప్రచారకర్తగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. పద్మశాలి సాధికారిత సంఘం ఆధ్వర్యంలో జరిగే చేనేత సత్యాగ్రహం, పద్మశాలీ గర్జన కార్యక్రమాల్లో కూడా తాను పాల్గొంటానని సంఘం ప్రతినిధులకు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పద్మశాలి సాధికారిత సంఘం నేతలు మాట్లాడుతూ... రాష్ట్ర సర్కారు తమ కులస్తులకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు చేనేత వర్గాలకు 21 సీట్లు కేటాయించాలని అన్నారు. మంగళగిరి ఆర్టీసీ డిపో రోడ్డు ఎదురుగా వున్న ఖాళీ ప్రదేశంలో తాము సత్యాగ్రహం చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు.