: పన్నీర్ సెల్వంకు చుక్కెదురు... జల్లికట్టును ప్రారంభించలేకపోయిన తమిళనాడు సీఎం
ఈ ఉదయం జల్లికట్టు క్రీడను ప్రారంభించేందుకు మదురై జిల్లా అలంగనల్లూరుకు వచ్చిన తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు చుక్కెదురైంది. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం చూపాలని అక్కడి యువత పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో, జల్లికట్టును ప్రారంభించకుండానే ఆయన వెళ్లిపోయారు. ఇక దిండిగల్ లో జల్లికట్టును పన్నీర్ సెల్వం ప్రారంభిస్తారని తమిళనాడు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
నాలుగు రోజుల పాటు సంఘటితమై జల్లికట్టుపై ఆర్డినెన్స్ సంపాదించుకున్నప్పటికీ, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఇప్పుడే గట్టి పట్టును ప్రదర్శించాలని తమిళనాట యువత నిర్ణయించుకుంది. జల్లికట్టును భవిష్యత్తులో ఎవరూ అడ్డుకోకుండా చర్యలు తీసుకుంటేనే పన్నీరు సెల్వంను సీఎంగా ఆదరిస్తామని, లేకుంటే ఎక్కడికి వెళ్లినా నిరసనలు తప్పవని పలువురు నినాదాలు చేశారు.