: ఒబామా తొలగించిన విగ్రహాన్ని తిరిగి పెట్టించుకున్న ట్రంప్


మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్న పలు నిర్ణయాలను రద్దు చేస్తూ, తనదైన పాలన ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్, వైట్ హౌస్ లో బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి విన్ స్టన్ చర్చిల్ విగ్రహాన్ని తిరిగి పెట్టించారు. 2009లో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత విన్ స్టన్ చర్చిల్ విగ్రహాన్ని తొలగించారు. ఇప్పుడు వైట్ హౌస్ ను తన అభిరుచికి అనుగుణంగా మార్చుకునే పనిలో ఉన్న ఆయన, ఈ విగ్రహాన్ని తిరిగి తెప్పించుకున్నారు. ఇక ఒబామా పెట్టించిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ విగ్రహాన్ని ఆయన తొలగించారని మీడియాలో వార్తలు రావడంతో దాన్ని ట్రంప్ బృందం ఖండించింది. ఈ మేరకు ప్రెస్ సెక్రటరీ ట్వీట్ చేస్తూ, నిజాలు తెలుసుకోవాలని చురకలంటించారు.

  • Loading...

More Telugu News