: రాజకీయాల్లోకి సురేష్ రైనా... సమాజ్ వాదీ పార్టీలో చేరిక?


టీమిండియా ఆటగాడు సురేష్ రైనా రాజకీయాల్లోకి రానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో సురేష్ రైనా రాజకీయ రంగ ప్రవేశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సురేష్ రైనా సమాజ్ వాదీ పార్టీ కీలక నేత రాంగోపాల్ యాదవ్ ను ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా రైనా రాజకీయ రంగప్రవేశం, పార్టీలో చేరికపై సమాలోచనలు నడిచినట్టు తెలుస్తోంది.

ఉత్తరప్రదేశ్ కు చెందిన సురేష్ రైనా నిలకడ లోపంతో ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ జట్టులో స్థానం సంపాదించలేకపోయిన సంగతి తెలిసిందే. దాంతో రాజకీయ రంగ ప్రవేశం దిశగా రైనా ప్రయత్నాలు ప్రారంభించినట్టు, ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్టు ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. అయితే వారిద్దరి మధ్య జరిగిన చర్చల వివరాలు రహస్యంగా ఉండడం విశేషం. సమాజ్ వాదీ పార్టీ తొలి జాబితాను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రైనా పేరు మలి జాబితాలో చేసుకుంటుందో లేదో చూడాలి!  

  • Loading...

More Telugu News