: కాపు సత్యాగ్రహ యాత్రకు అనుమతి నిరాకరణ


తూర్పుగోదావరి జిల్లాలోఈ నెల 25 నుంచి ఆరు రోజుల పాటు తలపెట్టిన కాపు సత్యాగ్రహ యాత్రకు అనుమతి లభించలేదు. గత సంఘటనల నేపథ్యంలో ఈ యాత్రకు అనుమతి ఇవ్వడం లేదని జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పాదయాత్రకు కూడా యానాం పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. కాగా, కాపు రిజర్వేషన్ల సాధన నిమిత్తం రావులపాలెం నుంచి ఈ యాత్రను ప్రారంభించాలని ముద్రగడ పద్మనాభం నిర్ణయించారు. అక్కడి నుంచి అమలాపురం మీదుగా అంతర్వేది వరకు ఈ యాత్ర తలపెట్టారు. గాంధేయ మార్గంలోనే కాపు సత్యాగ్రహ యాత్రను నిర్వహిస్తామని ముద్రగడ పేర్కొనడం విదితమే.

  • Loading...

More Telugu News