: సిద్ధార్థ్ మల్హోత్రాకు స్టార్ డమ్ తెచ్చిన ఇబ్బందులు!
బాలీవుడ్ లో ప్రతిభావంతులైన యువ కథానాయకుల్లో సిద్ధార్థ్ మల్హోత్రా ముందువరుసలో ఉంటాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ లో ప్రవేశించిన సిద్ధార్థ్ అనతికాలంలోనే ప్రతిభావంతుడైన నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే స్టార్ డమ్ వల్ల వచ్చే ఇబ్బందులపై చిరాకు పడుతున్నాడు. ఈ స్టార్ డమ్ శాశ్వతం కాదని చెబుతున్నాడు. అసలు తనకు ఎలాంటి స్టార్ డమ్ అవసరం లేదని పేర్కొంటున్నాడు. పాతికేళ్ల పాటు ఢిల్లీలో సరదాగా ఏది నచ్చితే అది చేశానని చెబుతున్నాడు. ఇప్పుడది సాధ్యం కావడం లేదని, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా ఎవరిని కలిసినా తనను స్టార్ అన్న ఫీలింగ్ తోనే చూస్తున్నారని, తనతో బాలీవుడ్ గురించే చర్చిస్తున్నారని మండిపడుతున్నాడు.