: మిలటరీ అధికారులతో తొలి డాన్స్ చేసిన ట్రంప్, మెలానియా
తాజాగా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ భార్యతో కలసి డ్యాన్స్ చేశారు. రాత్రి అధ్యక్షుడి గౌరవార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ తన భార్య, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ తో కలసి డాన్స్ చేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం సంప్రదాయం ప్రకారం త్రివిధ దళాధికారులతో కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సతీమణితో కలిసి ట్రంప్ డాన్స్ చేయగా, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తన భార్య కరేనాతో కాలుకదిపారు. అనంతరం నేవీ అధికారిణి కేథరీన్ కార్ట్ మెల్ తో ట్రంప్ డాన్స్ చేయగా, మెలానియా ట్రంప్ ఆర్మీ అధికారి జోస్ ఏ మెడీనాతో కాలుకదిపారు. అనంతరం కేక్ కోసి సైనికాధికారులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మెలానియా సైనికాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వారికి ఫస్ట్ లేడీగా ఉండడం గర్వంగా ఉందని అన్నారు.