: విద్యార్థినులకు వాతలు పెట్టిన బాధ్యులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశం


ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఓ మదర్సాలో విద్యార్థినులకు  అట్లకాడతో వాతలు పెట్టిన దారుణ సంఘటనపై ఏపీ మంత్రి పీతల సుజాత స్పందించారు. ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ సంఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. కాగా, కనిగిరి పట్టణంలోని మదర్సాకు చెందిన విద్యార్థినులకు అట్లకాడతో ప్రధానోపాధ్యాయురాలు వాతలు పెట్టారు. రెండు, మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహిళా ఉపాధ్యాయుల మాటలను విద్యార్థినులు  వినడం లేదనే అక్కసుతో, వారిని శారీరకంగా హింసిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News