: మావోయిస్టులకు దమ్ముంటే... ఆ ఎమ్మెల్యేలను కాల్చి చంపాలి: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు ఉన్నది సామాన్యులను, పేదలను చంపడానికా? అని ఆయన ప్రశ్నించారు. మెరుగైన సమాజం కోసం, అవినీతిని అంతం చేయడానికే తాము పోరాటం చేస్తున్నామని చెప్పుకునే మావోయిస్టులు... దమ్ముంటే అవినీతికి పాల్పడుతున్న నలుగురైదుగురు ఎమ్మెల్యేలను కాల్చి చంపాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు తిరుగుతున్న అడవుల్లో అవినీతి లేదని... ప్రజల మధ్యే ఉందని అన్నారు. మావోయిస్టులంతా అడవులను వీడి, ప్రజల మధ్యకు రావాలని డిమాండ్ చేశారు. కొంత మంది మావోయిస్టులు బలవంతంగా డబ్బులు వసూలు చేసి, అడవుల్లోని డంపుల్లో దాస్తున్నారని ఆరోపించారు.