: సూపర్ స్టార్ కు 150వ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇద్దామనుకున్నాం: చిరంజీవి


మెగాస్టార్ చిరంజీవి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన 150వ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కు ఒక పాత్ర ఇవ్వాలని ముందు అనుకున్నామని... ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నామని తెలిపారు. చిరంజీవి 150వ సినిమా తీస్తే అందులో అతిథి పాత్రలో నటించేందుకు తాను సిద్ధమంటూ అమితాబ్ చెప్పిన మాటను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. వాస్తవానికి తాను 150వ చిత్రం చేయడానికి అమితాబ్ ప్రోత్సాహం కూడా ఒక కారణమని చెప్పారు. 150వ చిత్రంలో అమితాబ్ లాంటి గొప్ప నటుడు నటించేందుకు సరైన పాత్ర లేదని చిరు తెలిపారు.

  • Loading...

More Telugu News