: స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చాము: నటుడు నాగార్జున
తిరుమల శ్రీవారిని ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్ర బృందం దర్శించుకుంది. ఈ చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు, సినీ నటుడు నాగార్జున దంపతులు, చిత్ర నిర్మాత మహేశ్ రెడ్డి తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం, నాగార్జున మాట్లాడుతూ, ‘షూటింగ్ చాలా బాగా జరిగింది. వెంకటేశ్వరస్వామి, హథీరాం బాబా మధ్య జరిగిన కథ, లీలలను రాఘవేంద్రరావుగారు అద్భుతంగా చిత్రీకరించారు. సెన్సార్ పూర్తి అయితే కనుక ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకుంటున్నాం. స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చాము’ అని నాగార్జున చెప్పారు. కాగా, ‘ఓం నమో వెంకటేశాయ’లో వెంకటేశ్వరస్వామి పాత్రను సౌరభ్, కృష్ణమ్మ పాత్రను నటి అనుష్క పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, తదితరులు నటిస్తున్నారు.