: వైట్ హౌస్ కు చేరుకున్న ట్రంప్ దంపతులు... స్వాగతం పలికిన ఒబామా దంపతులు!


అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కి నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు చేరుకున్నారు. ఆయనకు అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిద్దరూ తేనీటి విందులో పాల్గొనున్నారు. అనంతరం పదవీ బాధ్యతలను బరాక్ ఒబామా, నూతన అధ్యక్షుడు ట్రంప్ కు అప్పగించనున్నారు. దీంతో ఒబామా వైట్ హౌస్ ను వీడడం, ట్రంప్ వైట్ హౌస్ లో అధ్యక్షుడిగా ప్రవేశించడం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ లో విభిన్నమైన వాతావరణం నెలకొంది. మరోవైపు ట్రంప్ పదవీ ప్రమాణం చూసేందుకు భారీ సంఖ్యలో ఆయన మద్దతుదారులు చేరుకున్నారు. తొలుత వైస్ ప్రెసెడెంట్ ప్రమాణ స్వీకారం తరువాత ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం జరగనుంది. దీనిని అమెరికన్లు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. 

  • Loading...

More Telugu News