: యువీని చూసి నేర్చుకోవాలి!: సెహ్వాగ్ ఉద్వేగపూరిత ట్వీట్
కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో చెలరేగిపోయి 150 పరుగులు చేసిన యువరాజ్ సింగ్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే యువీ మాజీ సహచరుడు, ట్విట్టర్ కింగ్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం తనదైన శైలిలో ఉద్వేగభరితమైన ట్వీట్ చేశాడు. ‘అతను (యువీ) కేన్సర్ ను ఓడించాడు. ఇవాళ ఇంగ్లండ్ బౌలర్లను ఓడించాడు. నిరాశ చెందకూడదని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి’ అని ట్వీటాడు. అంతే కాకుండా కేన్సర్ తో పోరాడుతున్న సందర్భంలో యువీకి తీసిన ఫోటోను కూడా వీరూ పోస్టు చేశాడు.