: సీక్రెట్ లు వెల్లడించిందని భార్యను హత్య చేసి, ఉరి వేసుకున్న భర్త
దంపతుల మధ్య సవాలక్ష విషయాలుంటాయి. కొంత మంది వాటిని ఆత్మీయులతో పంచుకుంటారు. అలాగే స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకుందన్న కోపంతో భార్యను హత్య చేసి, ఉరివేసుకున్నాడో భర్త. వివరాల్లోకి వెళ్తే... పూణేలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న రాజేష్ (34), సోనాలి (28)కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. నాలుగేళ్లైనా వారికి పిల్లలు పుట్టలేదు. ఈ క్రమంలో కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు స్నేహితులతో పంచుకుంటోందంటూ పలు సందర్భాల్లో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం అలవాటుగా మారింది.
ఈ క్రమంలో తన మాట వినడం లేదని భార్యతో గొడవపడి, ఆమె గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం సోనాలితో ఆనందంగా గడపలేకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకున్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సోనాలి ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె సోదరుడు ఇంటికెళ్లి చూడడంతో విషయం వెలుగుచూసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.