: ‘బండ్ల ఈజ్ బ్యాక్ విత్ ‘బాస్’?’ అంటున్న సినీ నిర్మాత బండ్ల గణేశ్


‘బండ్ల ఈజ్ బ్యాక్ విత్ ‘బాస్’?’ అంటూ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ తాజాగా చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ‘బండ్ల ఈజ్ బ్యాక్ విత్ ‘బాస్’?’ అనే క్యాప్షన్ తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి దిగిన ఒక ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశాడు. అయితే, ఈ ట్వీట్ అంతరార్థం ఏంటనే దానిపై  సినీ రంగానికి చెందిన వారు, అభిమానులతో పాటు నెటిజన్లకు పలు సందేహాలు వస్తున్నాయి. పవన్ తో కలిసి మరో సినిమా తీసే అవకాశం బండ్ల గణేశ్ కు లభించిందా? లేక, ట్విట్టర్ ద్వారా పవన్ తో కలిసి మళ్లీ మీ ముందుకు వచ్చాననే అర్థమా? అనే విషయం గణేశ్ కే తెలియాలని అంటున్న వాళ్లూ లేకపోలేదు.

  • Loading...

More Telugu News