: ఒకట్రెండు రోజుల్లో జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్... కేంద్ర హోంశాఖ టేబుల్ పై ఆర్డినెన్స్ డ్రాఫ్ట్
తమ సంప్రదాయ క్రీడ జల్లికట్టును రక్షించుకోవడానికి యావత్ తమిళనాడు ఏకమైంది. విద్యార్థుల దగ్గర నుంచి రాజకీయ, సినీ ప్రముఖుల వరకు జల్లికట్టును కొనసాగించాల్సిందే అంటూ అక్కడ నినదిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు మహేష్ బాబు కూడా జల్లికట్టుకు మద్దతు పలికారు. జల్లికట్టు కోసం ఆందోళనలు రోజురోజుకూ ఉద్ధృతం అవుతుండటంతో, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. జల్లికట్టుకు సంబంధించి అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుంది. ప్రస్తుతం దీని ఆర్డినెన్స్ కు సంబంధించిన డ్రాఫ్ట్ కేంద్ర హోంశాఖకు పంపించారు. అక్కడ నుంచి క్లియరెన్స్ రాగానే... కేంద్ర కేబినెట్ ఆమోదంతో, ఆర్డినెన్స్ ను రాష్ట్రపతికి పంపుతారు. ఈ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెల్లడించారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చినా... దాన్ని సవాలు చేయడానికి జంతు హక్కుల సంస్థ పెటా సిద్ధమవుతోంది.