: దసరా నుంచి తెలంగాణలో సినీ అవార్డులు ఇస్తాం: మంత్రి తలసాని


తెలంగాణ ప్రభుత్వం తరపున తెలుగు సినిమాలకు ఇచ్చే అవార్డులను దసరా పండగ నుంచి ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు ఇండీవుడ్ కార్నివాల్ నిర్వహిస్తామని, సినీ పరిశ్రమ నుంచి వచ్చే వాణిజ్య పన్నును ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు కేటాయిస్తామని చెప్పారు. కార్నివాల్ కు వంద దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని,  ఈసారి కమిటీలో తెలుగు చలన చిత్ర ప్రముఖులకూ చోటు కల్పిస్తామని చెప్పారు. అనంతరం కార్నివాల్ వ్యవస్థాపకుడు సోహార్ రాయ్, ఇండీ వుడ్ మాట్లాడుతూ, దేశ చలనచిత్ర రంగంలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని, యువత, విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించాల్సి ఉందని అన్నారు. అందుకే, కళాశాలలు, పాఠశాల్లలో కార్యక్రమాలు చేపట్టామని, చలన చిత్ర ప్రముఖులందరూ ప్రతి ఏటా కలిసి అన్ని అంశాలపై చర్చించాలని భావిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News