: హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బీరు సీసాతో పొడిచిన ఇంజినీరింగ్ విద్యార్థి
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ బారులో నిన్న రాత్రి జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బారులో కూర్చొని ఫుల్లుగా బీరుకొడుతున్న కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడే ఉన్న పలువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో గొడవపడ్డారు. అది కాస్తా పెరిగి ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బీరుసీసాతో పొడిచాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయి నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.