: శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసుల కూంబింగ్.. తమిళ స్మగ్లర్ల రాళ్లదాడి
చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న ఏపీ టాస్క్‌ఫోర్స్ పోలీసులపై తమిళ స్మగ్లర్లు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈతగుంట వద్ద పోలీసులకు తారసపడిన స్మగ్లర్లు వెంటనే రాళ్లతో పోలీసులను తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురు దాడి ప్రారంభించారు. ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బియ్యం, నిత్యావసర వస్తువులు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. పరారైన 30 మంది స్మగ్లర్ల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.