: ‘జియో’ ఆఫర్ మరో మూడు నెలల పాటు పొడిగింపు?
‘రిలయన్స్’ జియో తన ఆఫర్ ను మరో మూడు నెలల పాటు పొడిగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆరు నెలల పాటు ఉచిత కాల్స్, డేటా సేవలు అందిస్తున్న ‘జియో’ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే, తాజాగా తీసుకురానున్న ఈ ఆఫర్ ను కేవలం రూ.100 కే అందించాలని, అలాగే జూన్ 30వ తేదీ వరకు దీనిని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ ముగిసే లోగా కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తోందట. కాగా, రిలయన్స్ జియో ‘వెల్ కమ్’ ఆఫర్ పేరిట ఉచిత సేవలను ప్రారంభించడం, ఆ తర్వాత ‘హ్యాపీ న్యూ ఇయర్’ పేరిట మార్చి 31 వరకు ఆ ఆఫర్ ను పొడిగించడం తెలిసిందే.