: గన్నవరం ఎయిర్ పోర్టులో మంటలు.. దట్టంగా అలముకున్న పొగలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయంలోంచి దట్టమైన పొగలు రావడం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆందోళన రేపింది. కాగా, అవి విమానాశ్రయంలోని టెర్మినస్ లోంచి వచ్చినవి కాదని, రన్ వేను అనుకుని ఉన్న గడ్డికి మంటలంటుకోవడం ద్వారా వచ్చిన మంటలు, పొగలు అని తెలియడంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, రన్ వేను అనుకుని ఉన్న గడ్డికి నిప్పంటుకోవడంతో ఒక్కసారిగా విమానాశ్రయం పరిసరాల్లో దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన గన్నవరం విమానాశ్రయం సిబ్బంది అగ్నిమాపక శకటంతో వాటిని ఆర్పేశారు. ఈ క్రమంలో రన్ వే పొడవునా ఉన్న గడ్డి కాలి బూడిదైంది. మంటలు వ్యాపించిన సమయంలో విమాన రాకపోకలేవీ లేకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.