: బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. ఆదిలోనే ఎదురుదెబ్బ
కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. దాంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా రాహుల్, ధావన్ క్రీజులోకి వచ్చారు. అయితే, బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఇంగ్లండ్ బౌలర్ వోక్స్ చేతిలో 14 పరుగుల వద్ద రాహుల్(5) వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చాడు.
టెస్టు సిరీస్‌లో ఓటమి చవిచూసిన ఇంగ్లండ్ ఈ రోజు జరిగే వన్డే మ్యాచులోనూ ఓడిపోతే వన్డే సిరీస్‌ను కూడా కోల్పోతుంది. దీంతో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో ఎలాగైనా సరే నెగ్గాలనే కసితో ఇంగ్లండ్ టీమ్ ఉంది.