: అమెరికా అధ్యక్షుడు అయ్యే అవకాశం హిందువుకు కూడా ఉంది: ఒబామా


అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు అయ్యే అవకాశం హిందువుకు కూడా ఉందని పదవీ విరమణ చేయనున్న ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. అమెరికాలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని... భవిష్యత్తులో ఇక్కడ మహిళలే కాకుండా, హిందువులు, యూదులు, లాటినోలు కూడా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. వైట్ హౌస్ నుంచి చివరిసారిగా ప్రసంగిస్తూ ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలో ప్రతి జాతి, మతానికి చెందిన వారు అత్యంత ప్రతిభావంతులుగా ఎదుగుతున్నారని ఈ సందర్భంగా చెప్పారు. అవకాశాలను మనం ప్రతి ఒక్కరికీ ఇవ్వడాన్ని కొనసాగించాలని సూచించారు. త్వరలోనే అమెరికాకు ఓ మహిళ అధ్యక్షురాలిగా వస్తుందని చెప్పారు. 'మీ ద్వారా ఒక నల్ల జాతీయుడు అధ్యక్షుడు అయ్యారని... అలాంటిది మళ్లీ జరిగే అవకాశం ఉందా?' అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు... ఒబామా పైవిధంగా స్పందించారు. అమెరికాలో తమను చిన్న చూపు చూస్తున్నారని భావిస్తున్నవారంతా ట్రంప్ కు ఓటు వేశారని తెలిపారు. తమకు వచ్చిన అవకాశాలు తమ పిల్లలకు వస్తాయో? రావో? అని భయపడ్డారని అన్నారు. 

  • Loading...

More Telugu News