: బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీపై రేప్ కేసు
రా.వన్, చెన్నయ్ ఎక్స్ ప్రెస్, దిల్ వాలే వంటి హిందీ చిత్రాలను నిర్మించిన బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీపై రేప్ కేసు నమోదైంది. సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి 2015లో బీబీఎం విద్యార్థినిని ఆయన ట్రాప్ చేశాడు. అదే ఏడాది జూలైలో తనకు మత్తుమందిచ్చి రేప్ చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సందర్భంగా తీసిన అభ్యంతరకర ఫోటోలను అడ్డం పెట్టుకుని ఆరు నెలలపాటు ముంబై, హైదరాబాదుల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది.
అలాగే, అండర్ వరల్డ్ మాఫియాతో కరీం మొరానీకి సంబంధాలు ఉన్నాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దిల్ వాలే సినిమా విడుదలైన సమయంలో తనపై కరీం మొరానీ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తెలిపింది. కాగా, ఈ సినిమా 2015 డిసెంబర్ 18న విడుదలైంది. దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు కరీం మొరానీపై నాలుగు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.