: ప్రధాని మోదీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు!: 'ఆప్' నేత జోక్


తాను బీజేపీలో చేరబోతున్నానంటూ వస్తున్న వార్తలపై ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత కుమార్ విశ్వాస్ మండిపడ్డారు. తనపై వచ్చిన వదంతులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విశ్వసనీయ వర్గాల ద్వారా మోదీ టీడీపీలో చేరబోతున్నారనే విషయం తనకు తెలిసిందని ఆయన సెటైర్ వేశారు.

"మిత్రులారా, మీరు నాపై జోక్ చేసిన విధంగానే... నేను కూడా జోక్ చేశా", అంటూ ట్వీట్ చేశారు. 'సెన్సాఫ్ హ్యూమర్' పెంచుకోమని మోదీ చెబుతుంటే... ఆయన భక్తులు మాత్రం 'సెన్స్ ఆఫ్ రూమర్'ను పెంచుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.

ఈ అంశంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ, మోదీ కాంగ్రెస్ లో చేరబోతున్నారని, త్వరలోనే రాహుల్ గాంధీని కలవనున్నారని అన్నారు. మరో ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా మాట్లాడుతూ, అమిత్ షా ఆప్ లో చేరబోతున్నారా? అంటూ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News