: అమృతసర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన సిద్ధూ
ప్రముఖ మాజీ క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ అమృతసర్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సిద్ధూ, పార్టీ పెట్టి, తాజాగా కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయనకు అమృతసర్ తూర్పు నియోజకవర్గం కేటాయించగా, చివరి రోజైన నేడు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఆయన వెంట ఆయన భార్య నవ్ జ్యోత్, పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కాగా, ఆయపై బీజేపీ అభ్యర్థిగా అమృతసర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేష్ కుమార్ హనీ బరిలో నిలిచారు. ఫిబ్రవరి 4న ఒకేదశలో పంజాబ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా, వివిధ పార్టీలకు చెందిన నేతలు నేడు నామినేషన్ దాఖలు చేశారు.