: పవన్ కల్యాణ్ ను కలిసిన 'పోలవరం' బాధితులు
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పోలవరం బాధితులు కలిశారు. డంపింగ్ యార్డు నిర్మాణం పేరిట తమ నుంచి 203 ఎకరాల భూమిని అధికారులు బలవంతంగా సేకరిస్తున్నారని ఆరోపిస్తూ పోలవరం మండలంలోని మూలలంక గ్రామస్థులు పవన్ కల్యాణ్ కు తెలిపారు. కోర్టు తీర్పులను వివరించినా అధికారులు ఆగడం లేదని, మూడు పంటలు పండే తమ భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, డంపింగ్ యార్డ్ కోసం దగ్గర్లోని ఓ గ్రామానికి చెందిన బీడు భూములను చూపించినా అధికారులు అటువైపు చూడడం లేదని వారు తెలిపారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించాల్సి ఉంది.