: లైంగికంగా వేధించినట్టు ఒప్పుకో... ట్రంప్ పై న్యూయార్క్ కోర్టులో కేసు వేసిన రియాల్టీ షో మోడల్


తనను లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా, తాను తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు ఆరోపించడం ద్వారా తన మనోభావాలను దెబ్బతీశారంటూ రియాల్టీ టెలివిజన్ షో మోడల్ సుమ్మర్ జెర్వోస్, అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై న్యూయార్క్ కోర్టులో కేసు వేశారు. గతంలో ట్రంప్ రియాల్టీ షో 'ది అప్రెంటీస్' లో జెర్వోస్ కూడా పాల్గొంది. ఆ సమయంలో ట్రంప్ తనను అసభ్యకరంగా తాకాడని, వేధించాడని ఎన్నికలకు ముందు జెర్వోస్ ఆరోపించింది.

ట్రంప్ తనకు క్షమాపణలు చెప్పాలని, తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఒప్పుకుంటే చాలని చెప్పుకొచ్చింది. తాను దాఖలు చేసిన పిటిషన్ పై ట్రంప్ స్పందనను డిమాండ్ చేసింది. కాగా, ఆమెతో పాటు మరో పది మందికి పైగా మహిళలు ట్రంప్ పై ఇదే విధమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీటన్నింటినీ ట్రంప్ తోసిపుచ్చారు. తనను ఓడించే ప్రయత్నాల్లో భాగంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు తెలిపారు. ఇక తాజా కేసులపై స్పందించేందుకు ట్రంప్ ప్రతినిధి అందుబాటులో లేరు.

  • Loading...

More Telugu News