: నాంపల్లి కోర్టులో ఎంపీ కొత్తపల్లి గీత భర్తకు చుక్కెదురు!


అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావుకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఈయనపై వున్న బ్యాంకుల రుణం ఎగవేత కోసును విచారించిన ఎర్రమంజిల్ కోర్టు రామకోటేశ్వరరావుకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. దీనిని సవాల్ చేస్తూ రామకోటేశ్వరరావు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన నాంపల్లి కోర్టు, గతంలో ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. కాగా, సొంత కంపెనీ కోసం రామకోటేశ్వరరావు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 25 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఎగ్గొట్టారు. దీంతో బ్యాంకు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 

  • Loading...

More Telugu News