: మేమిద్దరం గత 16 ఏళ్లుగా ఒకరినొకరం చంపుకునేందుకు ప్రయత్నిస్తున్నాం: అక్షయ్ కుమార్ సరదా ట్వీట్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు డింపుల్ కపాడియా కుమార్తె, సినీ నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నాతో వివాహమై నేటికి 16 ఏళ్లు ముగిశాయి. ఈ విషయాన్ని ఆయన తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా ఆసక్తికరంగా తెలిపారు. తన ట్విట్టర్ ఖాతాలో గత 16 ఏళ్లుగా ప్రతిరోజూ తామిద్దరం ఒకరినొకరం చంపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, అయితే ఇప్పటికీ విజయవంతం కాలేకపోయామని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా వారిద్దరూ వంటగదిలో పోరాటానికి దిగిన 6 సెకెన్ల నిడివిగల వీడియోను పోస్టు చేశాడు. ఈ ట్వీట్ తోపాటు వీడియో కూడా వారి అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, ట్వింకిల్ గతంలో సినీ నటిగా ప్రస్థానం ప్రారంభించి, తాజాగా రచయిత్రిగా మారిన సంగతి తెలిసిందే.

16 years of trying to kill each other and we still haven't succeeded:) #16thanniversary #partnersincrime pic.twitter.com/XqGWQ2BQAI
— Twinkle Khanna (@mrsfunnybones) January 17, 2017