: జయలలిత రాజకీయ వారసురాలిని నేనే... రాజకీయాల్లోకి వస్తున్నా: దీప
తన మేనత్త జయలలితకు అసలు సిసలు రాజకీయ వారసురాలిని తానేనని ఆమె మేనకోడలు దీప స్పష్టం చేశారు. చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ తన అంతరంగాన్ని స్పష్టం చేశారు. జయ అడుగుజాడల్లోనే నడుస్తానని ఆమె తెలిపారు. జయ ఆశయాలను సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావాలని కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారని తెలిపారు. జయలలిత పుట్టినరోజైన ఫిబ్రవరి 24న తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో తమిళ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. తన సోదరుడు దీపక్ ఆసుపత్రిలో అమ్మతోనే ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా దీప నివాసం ముందు వేలాది మంది కార్యకర్తలు హల్ చల్ చేశారు. టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు.