: పనులు చేయకుండా గడ్డి పీకుతున్నారా?: కాంట్రాక్టర్లపై దేవినేని తీవ్ర ఆగ్రహం
ప్రాజెక్టు పనులను ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై ఏపీ నీటి పారుదల మంత్రి దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన ఆయన, పనులు ఆలస్యం కావడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేయకుండా గడ్డి పీకుతున్నారా? అంటూ నిప్పులు చెరిగారు. చేసే పనిపై పట్టుదల, పౌరుషం ఉండాలని, పనులు సమయానికి పూర్తి చేయాలన్న కసి ఉండాలని, పనితీరు మారకుంటే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఇదే సమయంలో పనుల నాణ్యతలో రాజీ పడితే సహించేది లేదని, పూర్తి క్వాలిటీతో కూడిన ప్రాజెక్టులనే నిర్మించాలని అన్నారు.