: 86వ అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన యువకుడు.. సెల్ఫీ ప్రయత్నమే కారణం?
ఓ యువకుడు 86 అంతస్తుల భవనంపై నుంచి కిందకు దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన రష్యాలోని మాస్కో ఓకో టవర్ వద్ద చోటుచేసుకుంది. ఆ యువకుడు సెల్ఫీ దిగే ప్రయత్నంలోనే కిందకు పడిపోయాడని కొందరు చెబుతున్నారు. అయితే, తండ్రితో గొడవ పడి ఆత్మహత్య చేసుకున్నాడని కూడా మరి కొందరి వాదన. ఆ టవర్ ఎత్తు సుమారు 1,162 అడుగులు ఉంటుంది. పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా ఉన్న ఈ టవర్ ఎల్లప్పుడూ రద్దీగా కనపడుతుంది.
నిన్న 18 ఏళ్ల అలెగ్జాండర్ అనే ఈ యువకుడు ఒక్కసారిగా ఓకో టవర్ పైనుంచి పార్కింగ్‌లో ఉన్న ఓ కారుపై పడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, రష్యాలోని కొన్ని వార్తాపత్రికలు ఈ న్యూస్‌ని ప్రచురిస్తూ... ఆ యువకుడు తన తండ్రితో కలిసి స్కేటింగ్ చేసేందుకు ఓకో టవర్‌కి వచ్చాడని, అదే సమయంలో తన తండ్రితో గొడవకు దిగి మనస్తాపానికి గురై కిందకి దూకి మృతి చెందాడని పేర్కొన్నాయి. మరి కొందరు మాత్రం టవర్‌పై సెల్ఫీ దిగేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నమే కారణమని చెబుతున్నారు.