: 'నా ట్విట్టర్ ను హ్యాక్ చేశారు' అంటూ ప్లేట్ ఫిరాయించిన హీరోయిన్ త్రిష!


జల్లికట్టు ఆటను నిషేధించాలంటూ కోర్టుకు ఎక్కిన 'పెటా' సభ్యురాలు, నిన్నటివరకూ ఆ ఆట జంతుహింసతో కూడుకున్నదని వాదిస్తూ వచ్చిన దక్షిణాది నటి త్రిష ప్లేటు ఫిరాయించింది. తనకు వ్యతిరేకంగా తమిళ తంబీల నుంచి ఎదురైన నిరసనలతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న ఆమె, తాను జల్లికట్టుకు వ్యతిరేకం కాదని, తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి, ఎవరో ఆ వ్యాఖ్యలు పెట్టారని ఆరోపించారు. ఇక త్రిష ఎన్ని చెప్పినా, ఆమెపై ఉన్న ఆగ్రహాన్ని తమిళులు తగ్గించుకునే పరిస్థితిలో లేరు. జల్లికట్టుకు వ్యతిరేకం కాదనుకుంటే, వెంటనే 'పెటా' నుంచి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమిళ సంప్రదాయాలను గౌరవించని ఏ నటీనటులనైనా అడ్డుకుంటామని తమిళ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కాగా, ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తాము జల్లికట్టుకు మద్దతిస్తున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News