: 'ఏక చైనా' విషయంలో బేరాల్లేవు... అమెరికాకు చైనా గట్టి బదులు


తైవాన్ తో కూడిన 'ఏక చైనా' విషయంలో ఎటువంటి మార్పు లేదని, ఈ విషయంలో అసలు బేరాలకే తావు లేదని చైనా అమెరికాకు స్పష్టం చేసింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికతో మాట్లాడుతూ... ప్రతీదానిని బేరమాడవచ్చని, ఏక చైనా విధానం కూడా ఇందుకు మినహాయింపు కాదని అన్నారు. దీనిపై చైనా విదేశాంగ మంత్రి లూ కింగ్ ఘాటుగా స్పందించారు. ఈ ప్రపంచంలో చైనా ఒక్కటేనని, తైవాన్ చైనాలో భాగమని స్పష్టం చేశారు. ఏక చైనా విషయంలో బేరాలు ఉండవన్నారు. 

  • Loading...

More Telugu News