: ఈ టీచర్ సిగ్గుతో తలదించుకునే పని చేశాడు!
ఓ ప్రభుత్వ ఎయిడెడ్ రెసిడెన్షియల్ పాఠశాల టీచర్ సభ్య సమాజం సిగ్గుపడే పనిచేశాడు. విద్యార్థినులను అర్ధరాత్రి సమయంలో నగ్నంగా స్నానం చేయాలని ఆదేశించడమే కాకుండా వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ మృగాడు గత ఐదు నెలలుగా ఇదే తంతు కొనసాగిస్తున్నాడని ఓ బాధితురాలు బయటకు చెప్పడంతో అతడి రాక్షస రూపం వెలుగు చూసింది.
చిన్నారుల హక్కుల సంస్థ ఫిర్యాదు మేరకు షిర్పూప్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో మొత్తం 120 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 36 మంది బాలికలు అని జిల్లా ఎస్పీ జి.శ్రీధర్ వెల్లడించారు. అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరుగా నివాస భవనాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్కూల్లో మొత్తం 8 మంది పురుష టీచర్లు ఉండగా, వారిలో ప్రతీ వారం ఇద్దరు చొప్పున స్కూల్లోనే బస చేస్తుంటారని తెలిపారు. స్కూల్లో వార్డెన్ లేరని, మహిళా టీచర్ ఒక్కరూ లేరని పేర్కొన్నారు. నిందితుడ్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.