: సెంచ‌రీతో చెల‌రేగిన విరాట్ కోహ్లీ... సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేసిన విరాట్


భారత్, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ల మధ్య పుణె వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచ‌రీతో చెల‌రేగిపోయాడు. నాలుగు కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా ఒత్తిడిలో ఉన్న వేళ క్రీజులో జాధ‌వ్‌తో క‌లిసి చ‌క్క‌ని షాట్లు ఆడుతూ విరాట్ కోహ్లీ త‌న వ‌న్డే కెరీర్‌లో 27వ శ‌త‌కం సాధించాడు. అంతేకాదు, ల‌క్ష్య ఛేద‌న‌లో 17 సెంచ‌రీలు చేసి ఇప్పటివరకు స‌చిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లీ స‌మం చేశాడు. మ‌రోవైపు ధాటిగా ఆడుతున్న మ‌రో ఆట‌గాడు జాధ‌వ్ 89 ప‌రుగులు చేసి సెంచ‌రీ దిశ‌గా దూసుకుపోతున్నాడు. టీమిండియా ప్ర‌స్తుత స్కోరు 240/4 గా ఉంది.


  • Loading...

More Telugu News