: ఈ బైక్ ధ‌ర కోటి పైమాటే.. భార‌త్‌లో లాంచ్‌.. ఫీచర్స్ అదుర్స్!


ప్ర‌పంచంలోనే మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ ట్విన్ సిలిండ‌ర్ ఇంజిన్‌తో ఇటాలియ‌న్ కంపెనీ డ్యుకాటి భార‌త్‌లో ఖ‌రీదైన బైక్‌ను లాంచ్ చేసింది. డ్యుకాటి 1299 సూప‌ర్‌లెగ్గెరా పేరుతో మార్కెట్లోకి వ‌చ్చిన ఈ బైక్ ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధ‌ర రూ.1,12,20,000. ఈ బైక్ త‌యారీలో ఇటాలియ‌న్ కంపెనీ డ్యుకాటి కార్బ‌న్ ఫైబ‌ర్‌ను వాడింది. 2016లో ఈ బైక్ తొలిసారి ఈఐసీఎంఏలో ద‌ర్శ‌న‌మిచ్చింది. కార్బ‌న్ ఫైబ‌ర్‌, అల్యూమినియం అలాయ్‌, టైటానియ‌మ్ స్క్రూలను దీని త‌యారీకి ఉప‌యోగించారు. దీంతో ఈ బైకు బ‌రువు 167 కేజీలుగా ఉంది. ఈ బైక్ టైర్ల త‌యారీకి అల్ట్రాస్ట్రాంగ్‌, లైట్ మెటీరియ‌ల్‌ల‌ను ఉప‌యోగించారు. ఈ మోడల్ బైకుల‌ను మొత్తం 500 త‌యారుచేయ‌నున్న‌ట్లు స‌ద‌రు కంపెనీ తెలిపింది. అందులో భార‌త్‌కు ఎన్ని యూనిట్లు ఇస్తామ‌న్న అంశంపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

  • Loading...

More Telugu News