: పుణె వన్డే: ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్


పుణె వేదికగా భారత్, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో బ్యాటింగ్‌ చేస్తోన్న ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో రాయ్ 73, హేల్స్ 9(ర‌నౌట్‌), రూట్ 78, మోర్గాన్ 28, బ‌ట్ల‌ర్ 31 ప‌రుగులు చేసి వెనుదిరిగారు. ప్ర‌స్తుతం క్రీజులో స్టోక్స్ 42, అలీ 9 ప‌రుగుల‌తో ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో పాండ్యా 2 వికెట్లు తీయ‌గా, బుమ్రా, జ‌డేజాల‌కు ఒక్కో వికెట్టు ద‌క్కాయి. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ స్కోరు 285(45 ఓవ‌ర్ల‌కి)గా ఉంది.

  • Loading...

More Telugu News