: రూటు మారింది... కేసీఆర్ పై లగడపాటి ప్రశంసలు


తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతున్న రోజుల్లో కేసీఆర్ పై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పించేవారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడటం, లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకోవడం జరిగిపోయాయి. ఆ తర్వాత ఆయన కనిపించడం కూడా మానేశారు. తాజాగా అదే కేసీఆర్ పై లగడపాటి ప్రశంసలు కురిపించారు. యాదాద్రిని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా మార్చడానికి కేసీఆర్ చేస్తున్న కృషి చాలా గొప్పదని... కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. యాదాద్రి రూపు రేఖలు మారుతున్నాయంటూ మీడియాలో మాత్రమే చూశానని... ఇప్పుడు ప్రత్యక్షంగా తిలకించానని తెలిపారు. యాదాద్రి పనులు దిగ్విజయంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. గతంలో యాదాద్రిని దర్శించుకున్న తర్వాతే తాను ఎంపీగా గెలిచానని చెప్పారు. లగడపాటి ఈరోజు యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, తన భవిష్యత్ రాజకీయాల గురించి మాత్రం ఆయన స్పందించలేదు. 

  • Loading...

More Telugu News