: భార‌త్ ఆ ప‌ని చేస్తే నదుల్లో రక్తం పారుతుంది.. జాగ్ర‌త్త!: హఫీజ్‌ సయీద్ హెచ్చరిక


భార‌త ఆర్మీ పీవోకేలో జ‌రిపిన‌ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ కి ప్ర‌తీకారంగా జమ్ముకశ్మీర్‌లోని అఖ్నూర్‌ ఆర్మీ క్యాంపుపై త‌మ‌ ఉగ్రవాదులు దాడి చేసి 30 మంది సైనికులను హ‌త‌మార్చార‌ని పాక్‌ టెర్రరిస్టు నాయకుడు, ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్‌ సయీద్ ఇటీవ‌లే వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న‌ మ‌రోసారి భార‌త్‌పై విరుచుకుప‌డ్డాడు.

ఓ ర్యాలీలో హఫీజ్ ప్ర‌సంగిస్తూ సింధు జలాల ఒప్పందం అంశాన్ని ప్రస్తావిస్తూ రెచ్చిపోయి వ్యాఖ్య‌లు చేశాడు. పాకిస్థాన్‌కు రావాల్సిన  నదీ జలాలను భారత్ నిలిపివేస్తే అవే నదుల్లో రక్తం పారుతుందని వ్యాఖ్యానించాడు. భార‌త్‌లోకి చొర‌బ‌డి ఉగ్రవాదులు దాడులు జ‌రుపుతున్న నేప‌థ్యంలో, పాకిస్థాన్‌కి బుద్ధి చెప్పేలా గతంలో ఆ దేశంతో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని భార‌త్ నిర్ణ‌యం తీసుకున్నట్టుగా వార్తలొస్తున్న సంగ‌తి తెలిసిందే.  

  • Loading...

More Telugu News