: చికెన్ ముక్క ఇవ్వకపోవడంతో... తుపాకీనే ఎక్కుపెట్టాడు!


డబ్బు కోసమో, నగల కోసమో తుపాకి ఎక్కుపెట్టిన ఘటనల గురించి వినుంటాం. కానీ, చికెన్ ముక్క ఇవ్వలేదన్న కోపంతో తుపాకీ ఎక్కుపెట్టాడు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హర్లేమ్ లోని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ లో తన క్లాస్ మేట్ అయిన ఓ బాలికను 12 ఏళ్ల బాలుడు కలిశాడు. ఈ సందర్భంగా సదరు బాలిక తింటున్న చికెన్ లోని ఓ ముక్క ఇవ్వాలంటూ అడిగాడు. దానికి ఆమె తిరస్కరించింది. దీంతో, బయటకు వెళ్లిన తర్వాత ఆమె తలపై తుపాకీ ఎక్కుపెట్టి బెదిరించాడు. దీంతో, భయభ్రాంతులకు గురైన ఆమె తనను వదిలేయాలంటూ ప్రాధేయపడింది. అయితే, మరుసటి రోజు ఈ విషయాన్ని పాఠశాలలోని ఉపాధ్యాయులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... ఆ అబ్బాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

  • Loading...

More Telugu News