: తూర్పు గోదావరి జిల్లాలో అర్ధరాత్రి అదరగొట్టిన అశ్లీల నృత్యాలు!


ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతుండగా, పనిలో పనిగా అశ్లీల నృత్యాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు దగ్గరుండి రికార్డింగ్ డ్యాన్సులను ప్రోత్సహిస్తుంటే, పోలీసులు పక్కనే ఉండి కూడా చూసీ చూడనట్టు ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని మల్కిపురం, తూర్పుపాలెం, కేశనపల్లి, పడమటిపాలెం, గుడిమెళ్ళంక తదితర గ్రామాల్లో నిన్న అర్ధరాత్రి రికార్డింగ్ డ్యాన్సులు జోరుగా సాగాయి. రాజమండ్రి, విజయవాడ, నరసరావుపేట తదితర ప్రాంతాల నుంచి డ్యాన్సర్లను తెప్పించి, వీటిని ఏర్పాటు చేసింది స్థానిక అధికార పార్టీ నేతలే కావడంతో, వీటిని అడ్డుకునే ధైర్యాన్ని పోలీసులు చేయలేకపోయారని సమాచారం.

  • Loading...

More Telugu News