: పార్కింగ్ విషయమై వివాదం.. ఇరిగేషన్ ఉద్యోగిపై కరీంనగర్ ఎమ్మెల్యే బంధువు దాడి!


పార్కింగ్ విషయమై తలెత్తిన వివాదంలో నీటి పారుదల శాఖ ఉద్యోగిపై కరీంనగర్ ఎమ్మెల్యే సమీప బంధువు ఒకరు దాడికి పాల్పడ్డారు.  నీటి పారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కమలాకర్ హైదరాబాద్  ఫిల్మ్ నగర్ లో నివాసముంటున్నాడు. ఇంటి వద్ద ద్విచక్రవాహనం పార్కింగ్  విషయమై నిన్నరాత్రి తలెత్తిన వివాదం దాడి వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో బాధితుడు కమలాకర్ మాట్లాడుతూ, కరీంనగర్ ఎమ్మెల్యే సమీప బంధువు రాజశేఖర్, అతని అనుచరులు  అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇంట్లో ఉన్న తనను బయటకు లాగి  మరీ కొట్టారని ఆరోపించాడు. అడ్డువచ్చిన తన భార్య, తల్లిపై కూడా చేయి చేసుకున్నారని వాపోయాడు. ఈ నేపథ్యంలో నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

  • Loading...

More Telugu News